గచ్చిబౌలిలో రూ. 5 కోట్లు నగదు పట్టివేత

Telangana Polls : గచ్చిబౌలిలో రూ. 5 కోట్లు నగదు పట్టివేత
హైదరాబాద్: ఎలక్షన్ కోడ్‌( Election Code ) లో భాగంగా నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కోట్ల నగదును మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు.. కొండాపూర్ బొటానికల్ రోడ్డు నుంచి చిరెక్ పబ్లిక్ స్కూల్ పైపు బ్రీజా కార్లో గుర్తుతెలియని వ్యక్తులు నగదును తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అటుగా వెళ్తున్న కారును తనిఖీ చేశారు. ఆ కారులో రెండు సంచుల్లో ఐదు కోట్ల రూపాయల తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించి ఆ నగదును సీజ్ చేశారు. పట్టుబడ్డ నగదు ఓ వ్యాపారవేత్తకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఆ నగదును ఐటీ శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారు..
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow