1 శ్రీ సత్యసాయి జిల్లా లో రాష్ట్రపతి పర్యటన. 2 బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు. 3 Pawan Kalyan: నేను మాట ఇస్తున్నా.. ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా..

సత్యసాయి జిల్లా:నవంబర్ 22
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా లోని పుట్టపర్తి కి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పథకాలు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలు సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగ నున్నాయి.పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటన నేప థ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి బుధవారం మధ్యాహ్నం ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 3.05 గంటలకు సాయి కుల్వంత్‌ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులకు డాక్టరేట్లు, బంగారు పథకాల ప్రధానం అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు
బెల్లంపల్లి :నవంబర్ 22 బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్ధి గడ్డం వినోద్‌ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు జరగుతున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఆయన సోదరుడు మాజీ ఎంపీ, చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్‌ నివాసంలో కూడా ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో సోదరులిద్దరిపై సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం వివేక్‌ నివాసంలో దాదాపు నాలుగున్నర గంటల పాటు సోదాలు జరిగాయి. ఈ నెల 13న ఫ్రీజ్‌ లో దాచిన రూ.8 కోట్ల నగదుపై ఐటీ ఆరా తీసింది. ఇంట్లో ఎలాంటి డాక్యుమెంట్లు, నగదు దొరకలేదని, తెలుస్తోంది. అటు మంచిర్యాలలో ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే.. షాదన్‌ కాలేజ్‌లో పనిచేస్తున్న ఇక్బాల్‌ అహ్మద్‌ నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌12 లో సోదాలు కొనసాగుతున్నాయి. కొమురంభీం జిల్లాలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్‌లో పలువురు వ్యాపారవేత్తల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు జరుపుతోంది. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది... Pawan Kalyan: నేను మాట ఇస్తున్నా.. ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా..
వరంగల్: ''తెలంగాణ నా గుండెచప్ఫుడు. ఇకపై తెలంగాణలో అడుగుపెడుతున్నాను. తెలంగాణ ధైర్యంతోనే ఆంధ్రాలో రౌడీలను, ఫ్యాక్షనిస్టులను ఎదుర్కొంటున్నాను'' అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jansena Chief Pawan Kalyan) అన్నారు.. బుధవారం హనుమకొండ హాంటర్ రోడ్డులోని బీజేపీ విజయ సంకల్ప సభలో (BJP Vijay Sankalp Sabha) పవన్ పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని.. గుండాల పాలన నడుస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. కమీషన్ల రాజ్యం నడుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మనిచ్చిందని తెలిపారు. పదేళ్లలో తాను తెలంగాణపై మాట్లాడలేదని అన్నారు. ప్రధాని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. దశాబ్దం తర్వాత మాట ఇస్తున్నానని... వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతాను అని జనసేనాని స్పష్టం చేశారు.. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినన్నారు. తెలంగాణలో జనసేన (Janasena) ఉంటుందని.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని తెలిపారు. 2009లో స్థాపించిన పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడటానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కారణమని చెప్పుకొచ్చారు. నాడు తెలంగాణకు మద్దతు ఇచ్చిన వారిలో తాను ఒకడిని అని అన్నారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించాలని కోరారు. సమస్యలొస్తే తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తెలంగాణలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయామని.. బీసీ ముఖ్యమంత్రినైనా చూడాలని అందుకే బీజేపీతో కలిసినట్లు తెలిపారు. జనసేన - బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. కాగా.. బీజేపీ విజయ సంకల్ప సభకు పవన్‌తో పాటు నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. జనసేనానిని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow