బిగ్ బ్రేకింగ్ న్యూస్ 💥బి అలర్ట్ ఎప్పుడు ఏదైనా జరగొచ్చు 🤔
పత్రిక ప్రకటన
జిల్లా పోలీసు కార్యాలయం
మహబూబ్ నగర్
01.09.2023
జిల్లాలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్.పి. శ్రీ కె.నరసింహ . జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (సెప్టెంబర్ 1వ తేది నుండి 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్.పి. శ్రీ కె నరసింహ తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపినారు. అలాగే ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి. హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని తెలిపినారు.
Tags
News@jcl.