నవాబుపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం* *అక్కడికక్కడే తల్లీ కొడుకుల దుర్మరణం*

 

*

-,నవాబుపేట : నవాబుపేట మండల పరిధిలోని దేపల్లి

గేట్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఎదురెదురుగా అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్ పల్సర్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో పల్సర్ వాహనాన్ని నడుపుతున్న నవాబుపేట మండల కేంద్రానికి చెందిన మరికంటి యాదగిరి (20), బైక్ పై ఆయన వెనుక కూర్చున్న మృతుడి తల్లి మరికంటి లక్ష్మమ్మ (52) వాహనంపై నుంచి ఎగిరి పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొందుర్గు మండల పరిధిలోని ఆగిర్యాల లో జరిగిన బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణమైన వారు ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال