తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్!
దసరాకు సొంతూరుకెళ్తున్నారా..? బస్సులో సీటు దొరకదనే టెన్షన్ ఉందా..? అయితే నో ఫియర్.. దసరాకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇంటి వద్దకే బస్సు పంపించనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ నుంచి లక్షలాది మంది దసరా, బతుకమ్మ పండక్కి తమ సొంత ఊర్లకు పయనమవుతారు. విద్యాసంస్థలు, ఆఫీసులకు పండుగ సెలవులు కావడంతో నగరం విడిచి తమ స్వస్థలాలకు వెళతారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించనుండగా.. రద్దీ కారణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పనుంది. ఎక్కువమంది ప్రయాణికులుంటే ఇంటి వద్దకే బస్సులు పంపిస్తామని టీజీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది.
🚌 ఇంటి వద్దకే బస్సు రావాలంటే ఏం చేయాలి..?
30 మంది గ్రూపుగా ఉంటే ప్రత్యేక బస్సు కోసం బుకింగ్ చేసుకోవాలి. దీంతో ఆర్టీసీ అధికారులు మీ ఇంటి వద్దకే బస్సు పంపిస్తారు. గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్ షిప్‌లు, కాలనీల్లో ఎక్కువమంది నివసిస్తూ ఉంటారు. ఒకే ప్రాంతానికి వెళ్లావారు 30 మంది ఉండి, ముందే కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే ఇంటి వద్దకే బస్సు పంపిస్తామని ఆర్టీసీ వెల్లడించింది. దీని వల్ల బస్టాండ్ వరకు వచ్చి బస్సుల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులకు సమయం, డబ్బులు ఆదా కానున్నాయి.
📞 ప్రత్యేక బస్సులు ఎలా బుక్ చేసుకోవాలి..?
మీ ఇంటి వద్దకే బస్సు రావడం వల్ల బస్సు మిస్ అవుతుందనే టెన్షన్ ఉండదు. ఈ బస్సులు బుక్ చేసుకునేందుకు ప్రత్యేక నెంబర్లను ఏరియాల వారీగా ఆర్టీసీ విడుదల చేసింది:
🎓 విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం
అలాగే విద్యార్థుల కోసం కాలేజీలు, హాస్టళ్ల వద్ద నుంచే ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. విద్యార్థులు వేలమంది ఉంటారు గనుక వారి కాలేజీల వద్ద నుంచే బస్సులు నడపనున్నారు.