యాపిల్ ఈవెంట్ అంటేనే మీమర్లకు పండగ. యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేయడం.. దానిపై సెటైర్లు వేయడం ఏటా జరిగేదే. ఈ కంపెనీ తమ ఫోన్ల డిజైన్లలో పెద్దగా మార్పులు చేయకపోవడం గురించి నెట్టింట ఎక్కువగా జోకులు పేలుతుంటాయి.
ఈ ఏడాది యాపిల్ తొలిసారి లాంచ్ చేసిన ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో (iPhone Duo)' మీమర్లకు చేతికి చిక్కింది. ఈ ఫోన్ ప్రారంభ ర దాదాపు రూ.3 లక్షలు ఉండడం చూసి.. 'ఫోన్ బదులు కొత్త కారే కొనుక్కోవచ్చు కదా బ్రో' అంటూ సెటైర్లు వేస్తున్నారు.
దీనికితోడు ఈ ఫోన్ ధర భారత్‌తో పోలిస్తే బ్యాంకాక్‌లో రూ.60వేలు తక్కువకు లభిస్తోంది. దీంతో 'రెండ్రోజులు బ్యాంకాక్ ట్రిప్‌నకు వెళ్లి.. పనిలో పనిగా ఫోల్డబుల్ ఫోన్ కొనుక్కోవడం బెటర్' అంటూ మరికొందరు సలహా ఇస్తున్నారు. బ్యాంకాక్ ప్రయాణానికి ఎంత ఖర్చవుతుందో పోస్ట్ చేస్తున్నారు.