తాజాగా, రెస్క్యూ సిబ్బంది త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, రెస్క్యూ సిబ్బంది త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీశారు.
నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన మెకానిల్ ఫోర్‌మ్యాన్ 30 ఏళ్ల షా, త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ 45 ఏళ్ల అమిర్ మహర్జన్‌లను టన్నెల్స్ నుంచి రక్షించారు.
వరదల కారణంగా టన్నెల్స్‌లో బురదలో చిక్కుకుపోయిన ఆ ఇద్దరూ 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డంతో అధికారుల్లో ఆశలు మొదలయ్యాయి.
నేపాల్ వ్యాప్తంగా 12 హైడ్రోపవర్ ప్రాజెక్ట్స్‌లో పని చేసే 900 మంది వరదల్లో గల్లంతయ్యారు.
దాదాపు 500 మంది టన్నెల్స్‌లో చిక్కుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డంతో.. మిగిలిన వారు కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
బయటకు వచ్చే సమయానికి ఇద్దరి చేతులు, కాళ్లకు గాయాలు ఉన్నాయని అధికారులు మీడియాకు తెలిపారు. టన్నెల్స్‌లో పాకటం కారణంగా వారికి గాయాలు అయి ఉండొచ్చని అన్నారు.
త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ అమిర్ మహర్జన్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.