లక్ష్మీ కాసులతో శ్రీ వాసవి మాత అలంకరణ - జడ్చర్లలో ఘనంగా శ్రావణ శుక్రవారం వేడుక


Flash News - Sri Vasavi Matha
ఫ్లాష్ న్యూస్ | JCL News TV

లక్ష్మీ కాసుల అలంకరణలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత

🌸 జడ్చర్ల పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో పవిత్ర శ్రావణమాసం నాలుగవ శుక్రవారం వేడుకలు ఘనంగా జరిగాయి.

పవిత్ర శ్రావణమాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా జడ్చర్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను, పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ కాసులతో సుందరంగా, భక్తి శ్రద్ధలతో అలంకరించారు.

అనంతరం కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం మరియు వాసవి పారాయణం ఘనంగా జరుపబడింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘ బాధ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మరియు భోజనం వితరణ చేయబడింది.

"భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు." — శ్రీమతి గంధం జ్యోతి (అధ్యక్షురాలు) & లత (ప్రధాన కార్యదర్శి),
జడ్చర్ల పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow