అమ్మా మైసమ్మ తల్లి.. చల్లగా చూడు మమ్మల్ని
వైభవంగా బంగారు మైసమ్మ బోనాల వేడుక
🔸 అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన భక్తులు
🔸 ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
🔸 మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు
జడ్చర్ల, ఆగస్టు 30:
“అమ్మా శ్రీ బంగారు మైసమ్మ తల్లి.. చల్లగా చూడు మమ్మల్ని.. నీ కరుణా కటాక్షములు ప్రసాదించి కాపాడు తల్లి” అంటూ కావేరమ్మపేట, జడ్చర్ల భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో 9వ వార్డులో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.
ఘనంగా బోనాల ఊరేగింపు
ఈ సందర్భంగా పట్టణ మహిళలు బోనాలతో ఊరేగింపుగా దేవాలయానికి చేరుకొని అమ్మవారికి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మహిళలు అమ్మవారికి నైవేద్యాలు, ఒడిబియ్యం సమర్పించి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారికి పొట్టేళ్లు, నాటు కోళ్లను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
అమ్మవారికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక పూజలు
```బోనాల ఉత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
మన సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం అభినందనీయమని, నియోజకవర్గ అభివృద్ధికి అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
```ప్రత్యేక పూజలు చేసిన లక్ష్మారెడ్డి
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
బోనాల వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
పాల్గొన్న నాయకులు, భక్తులు
```కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, నాయకులు అనిల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంశీకృష్ణ చారి, మాలిక్ షాకిర్, చటమోని రమేష్, గుండు చంద్రమౌళి, జగదీష్ చారి, మాజీ కౌన్సిలర్లు చైతన్య చౌహన్, కుమ్మరి రాజు, ప్రశాంత్ రెడ్డి, మహేష్, నాయకులు పిట్టల మురళి, కరాటే శ్రీను, శ్రీకాంత్, దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.
```🙏 శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తుల ఆకాంక్ష 🙏