మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై వేటు?

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి - ఏఐసీసీ పెద్దలతో భేటీ

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఏఐసీసీ పెద్దలతో భేటీ

CM Revanth Reddy Delhi Visit
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సీఎం మంగళవారం ఉదయం దిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఈ పర్యటనలో బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసి మంత్రి సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిల గురించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

సురేఖను తప్పించే అవకాశాలు ఎక్కువ

వీరిద్దరినీ తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మంత్రి సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ముఖ్యమంత్రి.. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని గట్టిగా పట్టుబట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

📋 ముఖ్యాంశాలు:

  • మంత్రివర్గ విస్తరణ, కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై కొంత సమయం తీసుకున్నా.. సురేఖ విషయంలో మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు లేవు
  • రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ార్జి మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రి చర్చించినట్లు సమాచారం
  • ఒకరిద్దరు మంత్రులు, నాయకులు..సురేఖపై చర్యలు లేకుండా చూడాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జితో మాట్లాడినట్లు తెలిసింది
  • అయితే ఆమె నుంచి ఎలాంటి హామీ రాలేదని సమాచారం

కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే నిర్ణయంలో ఏమైనా మార్పు ఉండొచ్చేమో కానీ.. లేదంటే మాత్రం కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


మెట్రో, మామునూరు విమానాశ్రయంపై..

రెండ్రోజుల దిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.

🤝 కేంద్ర మంత్రులతో భేటీలు:

🚇 మెట్రో రైలు ప్రాజెక్టు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలవనున్నారు
✈️ మామునూరు విమానాశ్రయం పురోగతిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడును కలవనున్నారు
🛡️ రక్షణ శాఖ ఒప్పందాలు డిసెంబరు 7-9 తేదీల్లో ఫ్యూచర్‌సిటీలో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్‌ తెలంగాణ' సదస్సులో పలు ిఫెన్స్‌ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్న నేపథ్యంలో.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ సమావేశం కానున్నారు
#RevanthReddy #DelhiVisit #KondaSurekha #Telangana #Congress #AICC #MetroProject #MamunuruAirport
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow