పదేళ్లలో ఏం వ్యాపారం చేశారని కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల సంపాదన వచ్చిందని ప్రశ్నించారు. చివరకు బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు దండుకున్న దుర్మార్గులు, నీచులని బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. అప్పులు తప్పులు చేసినవాళ్లు మళ్లీ వస్తే రాష్ట్రంలో ఫోన్ కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. ఆడబిడ్డల మాటలు దొంగతనంగా వినేవాడు అసలు మనిషేనా అని నిప్పులు చెరిగారు. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్‎దే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. దొరల అహంకారాన్ని మళ్లీ బొంద పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.