flash flash బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిల్

నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్ రేణుక ప్రవీణ్

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆయనతో పాటు సుమారు 30 మంది యువకులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొని కొత్తగా చేరిన వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వారికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ ప్రజా సేవలో కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు, యువకులు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow