డబుల్ బెడ్ రూం ఇండ్ల లిస్టులో నుంచి తన పేరు తొలగించారని కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఓ బాధితుడు ఆందోళనకు దిగాడు. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ అహ్మద్ ఇల్లు కోసం అప్లయ్ చేసుకున్నాడు. ఫస్ట్ లిస్టులో పేరు వచ్చినప్పటికీ తర్వాత తొలగించారని ఆవేదన చెందాడు. అదే సమయంతో తహసీల్దార్ జానకీ రాగా.. ఆమె కాల్లు మొక్కి తనకు ఇల్లు ఇవ్వాలని కోరారు. అనంతరం సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
పింఛన్ కోసం చెట్టెక్కి ఆందోళన..
నాకు మూర్ఛవ్యాధి ఉంది. మూడేండ్ల కిందటిదాకా 4వేల పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. పింఛన్ ఇప్పిస్తరా.. లేక ఇదే చెట్టుమీద సావాల్న’ అని కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు మండలం కంచర్లలో గురువారం గ్రామానికి చెందిన గొల్ల రాములు ఆందోళన చేశాడు. మూర్చ వ్యాధితో బాధపడుతున్న రాములుకు గతంలో పింఛన్ వచ్చేది. 3 ఏండ్ల క్రితం అది ఆగిపోయింది. మళ్లీ అప్లయ్ చేసుకున్నా ఫించన్రావడంలేదు.
దీంతో తన పింఛన్ గురించి ఎవరికి విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామ సభ జరగుతుండగా.. గ్రామ సచివాలయం ఆవరణలోని చెట్టుపైకి ఎక్కి .. తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని వార్డు సభ్యులు నచ్చజెప్పినా వినకపోవడంతో ఓ వార్డు మెంబర్ చెట్టుపైకి వెళ్ళి రాములుకు బుజ్జగించి కిందకు తీసుకువచ్చారు.