తాజా వార్తలు – ఏప్రిల్ 16 (ఉదయం అప్‌డేట్స్)

 



ఐపీఎల్ సమయంలో తనకు సహచరులు ఎంతో సపోర్ట్ ఇచ్చారని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తెలిపారు. వారి ఇళ్లకు వెళ్లినప్పుడు కూడా ఆత్మీయ స్వాగతం లభించిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన పీఎస్‌ఎల్‌లో ఆడుతున్నారు.



మహిళా రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడం పెద్ద కుట్ర అని కవిత విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా తప్పనిసరి అన్నారు.



అమరావతిలో లవ్ ట్రాప్ కేసు సంచలనం సృష్టించింది. అయాన్ అహ్మద్ తన్వీర్ అనే వ్యక్తి మిత్రుడితో పందేలు పెట్టుకొని యువతులను ట్రాప్ చేసి వీడియోలు చిత్రీకరించినట్లు సమాచారం. డబ్బు విషయంలో విభేదాల కారణంగా ఉజైర్ ఆ వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాడు.



హైదరాబాద్ జలమండలి కస్టమర్ కేర్ సేవల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్య పరిష్కారానికి బీఎస్‌ఎన్‌ఎల్ సాంకేతిక బృందం చర్యలు చేపట్టింది. వెబ్‌సైట్, యాప్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ కొనసాగుతుందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.



దర్శకుడు ఆర్జే బాలాజీ మాట్లాడుతూ, త్రిషతో సినిమా చేయాలని అనుకున్నా సాధ్యపడలేదని చెప్పారు. అందుకే ‘కరుప్పు’ సినిమాలో ఆమెను తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.



కృష్ణా జిల్లా నాగాయలంక వద్ద ఆటో బోల్తా పడటంతో 10 మంది కూలీలు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 537 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్లు పెరిగాయి.



కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సంతాపం వ్యక్తం చేశారు.



అదే ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.



“తల్లులు, సోదరీమణులకు గౌరవమే దేశానికి గౌరవం” అని ప్రధాని మోదీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.



తిరుపతి సమీపంలోని అడపారెడ్డిపల్లిలో భూవివాదం నేపథ్యంలో అమర్నాథ్ రెడ్డి హత్యకు గురయ్యాడు. రాహుల్ రెడ్డి ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



నాసిక్‌లో టీసీఎస్ బీపీవోలో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. హెచ్‌ఆర్ హెడ్ మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ కార్యాలయాన్ని మూసివేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow