గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వాడితే కఠిన చర్యలు : కలెక్టర్ ఖుష్బూ గుప్త


 

జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.

జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ వీసీ కాన్ఫరెన్స్ హాల్ లో గ్యాస్ సరఫరా పరిస్థితిపై ఎస్పీ జానకి, రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియలతో కలిసి ఆమె గ్యాస్ ఏజెన్సీల డీలర్ లు, గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్ లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలతో ఆమె సమీక్షించారు. జిల్లాలో ఎల్పీజీ డీలర్ ల దగ్గర బుకింగ్ స్టాక్, సరఫరాపై సమావేశంలో సమీక్షించి ప్రతి రోజు రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని సమావేశంలో ఆయిల్ కంపెనీల సేల్స్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. అమెరికా-ఇరాన్ కు జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని, జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ భరోసా కల్పించారు.

ఎల్పీజీ గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని, అదేవిధంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాధ శరణాలయాలు, వృద్దాశ్రమాల వంటి సంస్థలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ వాణిజ్య అవసరాలకు వినియోగించిన, స్టాక్ నిల్వ చేసినా పౌర సరఫరాల శాఖ అధికారులు, డిటి లు, ఎస్ఐ తో కూడిన 5 టీమ్ లు ఏర్పాటు చేసినట్లు, హోటళ్ళు, రెస్టారెంట్ లు తనిఖీ లు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన టీమ్ లు హోటళ్ళు, రెస్టారెంట్లు తనిఖీలు చేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లను వాణిజ్య అవసరాలకు వినియోగించిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం కింద 316-ఏ కేసులు నమోదు చేసి 54 సిలిండర్ లు స్వాధీనం చేసుకున్నట్లు పౌర సరఫరాల అధికారులు వివరించారు. జిల్లా ఎస్పీ జానకి మాట్లాడుతూ, ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు డెలివరీ జరగాలని, డెలివరీ బాయ్ లు డైవర్ట్ చేయకుండా డీలర్ లు వారికి ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. గృహ అవసరానికి వినియోగించే సిలిండర్ వాణిజ్య అవసరాలకు 2 కేజీ రీపిల్ చేయడం ప్రాణానికి ప్రమాదం అని ఆమె తెలిపారు. గ్యాస్ సిలిండర్ నిర్దేశించిన పరిణామంలో గ్యాస్ సరఫరా చేయాలని, తూనికల కొలతల అధికారులు తనిఖీ లు నిర్వహించాలని ఆదేశించారు.ఈ సమావేశం లో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సేల్స్ అధికారి సూర్య కిరణ్, లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్ పాల్గొన్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow