టెన్త్ ఎగ్జామ్స్ ఉండవ్.. ఇంటర్ పరీక్షలే కనిపించవ్! SSC-ఇంటర్‌ బోర్డుల విలీనంపై కసరత్తు!!

 

నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే బోర్డు!.. SSC-ఇండర్మీడియెట్ బోర్డుల్ని విలీనం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా సమాచారం. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికే కొత్త విధానమంటున్న రేవంత్ సర్కార్. A) జాతీయ విద్యావిధానం NEP 2020 ఏం చెబుతోంది? అదే తరహా విద్యావిధానం మురళి కమిషన్ సూచించిందా? తెలంగాణ విద్యా కమిషన్‌ నివేదికలో సిఫార్సులేంటి? B) విద్యార్థుల్ని బట్టీ పట్టేలా చేస్తున్న ప్రస్తుత విద్యావిధానం. ర్యాంకుల పేరుతో వేల కోట్ల విద్యా వ్యాపారంగా మారిన వైనం. కొత్త మార్పుతో ఎంసెట్‌, జేఈఈ వంటి వాటిలో ఎలాంటి మార్పులు వస్తాయి? C) ఇంటర్‌ రద్దును కార్పొరేట్ విద్యాసంస్థలు స్వాగతిస్తాయా? వ్యతిరేకిస్తాయా? విద్యావేత్తలు ఏమంటున్నారు? ఈ కొత్త విధానంతో ఏం మారుతుంది? జాతీయ విద్యా విధానంలో ఉన్నదేంటి? ఇంత పెద్ద మార్పుకు 'కార్పొరేట్' అంగీకారమా? వ్యతిరేకమా? పూర్తి డిటెల్స్‌ ఇప్పుడు చూద్దాం..

ఒక్క స్టూడెంట్ కూడా లేని స్కూళ్లు ఎన్నున్నాయో తెలుసా తెలంగాణలో. 1920. జీరో ఎన్‌రోల్‌మెంట్. కనీసం మూసేయరు, డెవలప్ చేయరు. స్కూల్ పిల్లల ప్రమాణాలను కొలిచే Annual Status of Education Report సర్వేలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల చదువుల స్థాయి అత్యంత దారుణం, ఆందోళనకరం. ప్రైవేట్‌లో మాత్రం గొప్పగా ఏముంది? లక్షన్నర మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటికొస్తున్నారు ఎవ్రీ ఇయర్. అందులో 20 శాతం మందికి జాజ్‌కు తగ్గ స్కిల్సే లేవు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఈ విద్యావ్యవస్థను ఏం చేస్తే బాగుంటుందో సిఫారసు చేయడానికి ఆకునూరి మురళి కమిషన్ వేసింది తెలంగాణ సర్కార్. బట్.. ఆ కమిషన్ రిపోర్ట్‌పై పాజిటివ్ టోన్, నెగటివ్ టోన్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమని రిపోర్ట్ ఇచ్చిందా కమిషన్? తెలంగాణ విద్యా విధానంలో రాబోయే మార్పులేంటి?  ఎందుకలా అన్నారు సీఎం రేవంత్. కొన్నేళ్లుగా ఇంటర్మీడియెట్ చుట్టూ చర్చ, రచ్చ జరుగుతూనే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది. ఇంటర్మీడియెట్ అనే ఈ చదువును సంస్కరించాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. కాని, ఇవాళ్టి వరకు అడుగులు పడలేదు. పర్టిక్యులర్‌గా ఇంటర్మీడియెట్ గురించే ఎందుకంటే.. విద్యార్ధులకు అతిపెద్ద భారంగా మారుతున్నది ఈ చదువే. టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటేనే వణుకు చాలామంది స్టూడెంట్స్‌కి. ఎగ్జామ్ రాయకముందే సరిగా మార్కులు రావేమోనని భయపడి చనిపోయిన వాళ్లున్నారు. రిజల్ట్స్ వచ్చాక సరేసరి. అంత పెద్ద గండాన్ని తట్టుకుని, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అవుతారు బిక్కుబిక్కుమని. ఫస్ట్ ఇయర్‌లో మళ్లీ పబ్లిక్ ఎగ్జామ్. అప్పటికే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి పేరెంట్స్‌కి. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తుంటారు. రెసిడెన్షియల్ కాలేజీలో పడేస్తారు. ‘మార్కులు’.. గుర్తుపెట్టుకో అని ఫోన్ చేసిన ప్రతిసారీ గుర్తు చేస్తుంటారు.

పేరెంట్స్‌ నార్మల్‌గానే చెబుతుండొచ్చు. కాని, అదో వార్నింగ్.. స్టూడెంట్స్ దృష్టిలో. హమ్మయ్య స్కోర్ చేశాం అనుకునే లోపు సెకండర్ ఇయర్‌లో మళ్లీ పబ్లిక్ ఎగ్జామ్. అప్పటికైనా రిలాక్స్ అవుతారా అంటే.. ఆ వెంటనే ఎంసెట్, నీట్, జేఈఈ అంటూ కాంపిటిటివ్ ఎగ్జామ్స్. పోనీ.. అంత కష్టపడి చదివి తెచ్చుకున్న మార్కులు పనికొస్తాయా అంటే.. నో వే. పచ్చిగా చెప్పాలంటే.. ఆ మార్కులకు అసలు విలువే లేదు. టెన్త్ మార్కులు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు పనికిరావు. ఇంటర్ ఫస్టియర్‌లో చేసిన స్కోర్.. సెకండ్ ఇయర్‌కు పనికిరావు. అసలు ఈ ఇంటర్మీడియెట్ మార్కులేవీ ఎంసెట్, నీట్, జేఈఈకి ఉపయోగపడవు. ఆమాత్రానికి వరుసగా మూడేళ్లపాటు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయడమెందుకు? విద్యార్ధుల మెదళ్లలో ఆటమ్‌బాంబ్ పెట్టి పేల్చడమెందుకు? 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow