లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయ‌తీ కార్యదర్శి...!

 

 అవినీతి రహిత పాలన అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు అధికారులు లంచాల వేట ఆపడం లేదు. అందినకాడికి దండుకుందామనుకున్నాడో ఏమో గానీ.. ఏకంగా పేదవాడి సొంతింటి కలను కూడా తన సొమ్ము చేసుకోవాలని చూశాడు ఈ కిలాడీ కార్యదర్శి.

అయిజ : ​"అవినీతి రహిత పాలన అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు అధికారులు లంచాల వేట ఆపడం లేదు. అందినకాడికి దండుకుందామనుకున్నాడో ఏమో గానీ.. ఏకంగా పేదవాడి సొంతింటి కలను కూడా తన సొమ్ము చేసుకోవాలని చూశాడు ఈ కిలాడీ కార్యదర్శి. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్‌పురం పంచాయతీ కార్యదర్శి రంగన్నకు గట్టి షాక్ తగిలింది. ఓ పేద లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే.. దానికి క్లియరెన్స్ ఇవ్వడానికి ఇతను ఏకంగా 20 వేల రూపాయలు డిమాండ్ చేశారు. పోనీ ఒక్కసారిగా ఇచ్చుకోలేరేమో అని భావించాడో ఏమో గానీ.. 'ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్' ఆఫర్ కూడా ఇచ్చాడు. నాలుగు వాయిదాలలో ఐదు వేల చొప్పున చెల్లించాలని కండీషన్ కూడాపెట్టాడు. ​"బాధితుడు కాళ్ల వేళ్ల పడి బ్రతిమలాడటంతో.. దయ తలచినట్లు నటిస్తూ..రూ. 15 వేలకు డీల్ ఫైనల్ చేశాడు. కానీ ఆ బాధితుడు సామాన్యుడు కాదు.. అవినీతిని అంతం చేయాలనుకున్న అత‌ను వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా స్కెచ్‌తో.. అయిజ ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో కార్యదర్శికి 15 వేల రూపాయలు తీసుకుంటుండగా పట్టించాడు. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ బృందం రంగన్నను చుట్టుముట్టి అవినీతి చేపను రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. దీంతో ఎంపీడీవో ఆఫీస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. "పేదలకు అందాల్సిన పథకాల విషయంలో లంచం అడిగితే సహించేది లేదు. 20 వేల నుంచి 15 వేలకు బేరమాడి, నగదు తీసుకుంటుండగా రంగన్నను అరెస్ట్ చేశాం. అవినీతికి పాల్పడితే ఏ స్థాయి అధికారిని అయినా వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారి బాలకృష్ణ అన్నారు.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow