కుక్కలకు ఆహారంగా మారిన శవం… జడ్చర్లలో దారుణ నిర్లక్ష్యం!

 

📍 జడ్చర్ల

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల పట్టణం మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి మృతిచెందిన ఘటన విషాదం రేపింది.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉంచిన మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం హృదయ విదారక దృశ్యంగా మారింది.

ఇలాంటి ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“ప్రాణం పోయినా గౌరవం ఉండాలి కదా?” అంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

👉 ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రత ఎక్కడ?
👉 మృతదేహాల సంరక్షణపై బాధ్యత ఎవరిది?
👉 ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకుంటారా?

జడ్చర్లలో జరిగిన ఈ ఘటన ప్రజల్లో భయం, ఆవేదన కలిగిస్తోంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow