అచ్చంపేట పట్టణంలో క్షుద్ర పూజల కలకలం..





అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. వివరాల్లోకెళ్తే.. పట్టణంలోని సాయి నగర్ కాలనీలో సోమవారం ఉదయం ఓ ఇంటిముందు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. దాంతో కాలనీవాసులు సైతం స్థానికంగా భయంకరమైన గురిచేసింది


ఆదివారం అర్ధరాత్రి...

ఆదివారం అర్ధరాత్రిలో ఎవరో దుండగులు కాలనీలోని ఒక ఇంటి ముందు క్షుద్రపూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. సోమవారం ఉదయం నిద్రలేచిన గృహిణి ఇంటి ముందున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నివ్వెర పోయింది. ఇంటిముందు మెట్లపైననే కోడిపేగులు, పాము బొమ్మ, పసుపు-కుంకుమ కలిపిన బియ్యం, నిమ్మకాయలతో కూడిన పూజా సామాగ్రిని చూసి ఆమె భయంతో కేకలు వేసినట్లు సమాచారం.
విరోధులే చేసి ఉంటారని...!

ఏ ప్రదేశంలో అయితే క్షుద్ర పూజలు చేశారో ఆ కుటుంబాన్ని నాశనం చేసే కుట్ర తమ విరోధులు కక్ష గట్టి ఉంటారని, వారి పాపను, కుటుంబం మీద చేతబడి చేసి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను మానసికంగా కృంగదీయడానికి, నాశనం చేయడానికి ఇటువంటి పనులు చేస్తున్నారని వారు రోదిస్తూ ఇరుగు పొరుగు వారికి వివరించారు. పై విషయంపై అచ్చంపేట ఎస్సై ఇందిరమ్మను దిశ ఫోన్ ద్వారా వివరణ కోరగా.. ఆ విషయం మా దృష్టికి రాలేదని ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow