హిజ్రాల బరితెగింపు చూశారా.. పరీక్షకు వెళ్తున్న తండ్రి, కూతురిని ఆపి అరాచకం..





గద్వాల క్రైం: గద్వాల పట్టణ శివారు రోడ్లపై ప్రయాణించాలంటేనే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొంతమంది హిజ్రాలు గుంపులుగా చేరి వాహనదారులను అడ్డుకుంటూ చేస్తున్న వసూళ్లు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. అత్యవసర పనుల మీద వెళ్తున్న వారిని, రోగులను, కనీసం పరీక్షలకు వెళ్లే విద్యార్థులను కూడా వదలకుండా వారు చేస్తున్న హల్చల్ స్థానికంగా పెను సంచలనంగా మారింది.


కూతురు పరీక్షకు వెళ్తుంటే ఆపి.. రూ. 500 లాక్కుని అరాచకం!

తాజాగా శనివారం జరిగిన ఒక ఘటన అందరినీ మనసుల్ని కలచివేస్తోంది. ఒక తండ్రి తన కూతురినీ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తుండగా, శివారు రోడ్డుపై హిజ్రాలు వారిని అడ్డుకున్నారు. పరీక్షకు సమయం మించిపోతోందని, తన దగ్గర చిల్లర లేదని, దయచేసి వదిలేయమని ఆ తండ్రి ఎంత వేడుకున్నా, వారు కనికరించలేదు. చివరకు ఆయన 500 రూపాయల నోటు ఇవ్వగా, "మా దగ్గర చిల్లర లేదు.. చిల్లర వచ్చే వరకు ఇక్కడే ఆగు" అంటూ ఆ తండ్రిని అక్కడే నిలిపివేసి మానసిక క్షోభకు గురిచేశారు. ఒక విద్యార్థి భవిష్యత్తును పణంగా పెట్టి వారు ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమర్జెన్సీలో ఉన్నా వదలని వైనం..

వీరి ఆగడాలు కేవలం విద్యార్థులకే పరిమితం కాలేదు. ఆరోగ్యం బాగాలేక తమ కుటుంబసభ్యుల్ని బైక్‌లపై ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో, లేదా బంధువులకు ప్రమాదం జరిగిందని ఆందోళనతో వెళ్తున్నా సరే.. వీరు మాత్రం తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కదిలేది అన్నట్లుగా ప్రయాణికులను వేధిస్తున్నారు.







పోలీసుల కౌన్సిలింగ్ ఇచ్చినా మారని తీరు..

గతంలో ఇలాంటి ఫిర్యాదులు రావడంతో పోలీసులు వీరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. "పోలీసులకు చెబుతాం" అని హెచ్చరించినా, వారు ఏమాత్రం బెదరడం లేదు. "ఎవరికి చెప్పుకున్నా పర్వాలేదు.. మాకు డబ్బులు ఇచ్చి వెళ్లాల్సిందే" అంటూ బాహాటంగానే సవాల్ విసురుతున్నారు. వరుసగా జరుగుతున్న ఈ అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గద్వాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసులు వెంటనే నిఘా పెంచి, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow