శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన

JADCHERLA NEWS:-శ్రీ చైతన్య పాఠశాల**లో అంతర్జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం పురస్కరించుకుని ఘనంగా విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ సజీలా పర్వీన్ ఒక ప్రకటనలో వివరించారు.



పాఠశాల డీన్ విజయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, విజ్ఞాన శాస్త్ర దినోత్సవం వంటి కార్యక్రమాలు విద్యార్థుల సృజనాత్మక శక్తికి నిలువెత్తు కొలమానం అవుతాయని అభిప్రాయపడ్డారు. సి బ్యాచ్ ఇంచార్జ్ శ్రీమతి స్రవంతి మాట్లాడుతూ, సరైన శిక్షణ మరియు మార్గదర్శకత్వం ఉంటే విద్యార్థులు అపూర్వ విజయాలను సాధించగలరని పేర్కొన్నారు.

విద్యార్థులు తమ సృజనాత్మకతకు పదును పెట్టి అద్భుతమైన విజ్ఞాన శాస్త్ర నమూనాలను ప్రదర్శించారు. ఏ.జీ.ఎం భాస్కర్ రెడ్డి మరియు పాలమూరు జిల్లా కోఆర్డినేటర్ రఘుబాబు విద్యార్థులను అభినందించారు.

ప్రదర్శనలో విజ్ఞానంతో పాటు వినోదాన్ని కలగలిపిన అనేక నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. కొంతమంది విద్యార్థులు జూనియర్ డాక్టర్ల మాదిరిగా రక్తపరీక్షలు నిర్వహించడం విశేషం. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి విభాగాలకు సంబంధించిన అంశాలను విద్యార్థులు స్పష్టంగా వివరిస్తూ తమ ప్రతిభను చాటారు.

విద్యార్థుల ప్రదర్శనలను వీక్షించిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, పిల్లలకు అందించిన మార్గదర్శకత్వాన్ని కొనియాడారు. సైన్స్ డే వేడుకలను విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకోవడమే కాకుండా, భవిష్యత్ తరాలకు విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యతను తమ మాటల్లో వివరించడం అందరినీ అబ్బురపరిచింది.

ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీమతి భాగ్యలక్ష్మి, సుస్మిత, శ్రీవాణి, జోఫిష, నౌషీన్ బేగం మరియు ఉపాధ్యాయ బృందం విజయవంతం చేశారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow