Padi Kaushik Reddy: 15 రోజులే గడువు.. లేదంటే అసెంబ్లీలో వీడియోలు రిలీజ్ చేస్తా.. కరీంనగర్ సీపీకి కౌశిక్ రెడ్డి అల్టిమేటం


 Padi Kaushik Reddy: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై విరుచుకుపడ్డారు. సీపీ తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సీపీ చేస్తున్న అక్రమాలకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని.. త్వరలోనే వాటిని అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించి సీపీపై చర్యలు తీసుకోకపోతే ఆధారాలన్నీ ప్రజల ముందు ఉంచుతానని అల్టిమేటం జారీ చేశారు.  ప్రభుత్వ వాహనాల దుర్వినియోగంపై కౌశిక్ రెడ్డి నంబర్లతో సహా వివరాలను బయటపెట్టారు. కరీంనగర్ సీపీకి కేటాయించిన ఇన్నోవా వాహనం (TS 09 PA 4195) హైదరాబాద్‌ ప్రాంతంలో తిరుగుతోందని.. దీనిని ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే మరో ప్రభుత్వ వాహనాన్ని (TS 09 PA 5601) గౌస్ ఆలం తన సోదరుడి వ్యక్తిగత పనుల కోసం వాడుతున్నారని విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వ నిధులను.. వనరులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమేనని ఆయన మండిపడ్డారు.

పోలీస్ కమిషనర్ తన కుటుంబ సభ్యుల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తన సతీమణికి కరీంనగర్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడమే కాకుండా.. ఆమె భద్రత కోసం ఇద్దరు కానిస్టేబుళ్లను నియమించారని తెలిపారు. సీపీ ఇంట్లోనే సుమారు 20 మంది కానిస్టేబుళ్లు పని చేస్తున్నారని.. శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులను ఇంటి పనులకు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి ఘటనల వల్ల ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పరువు మంటగలిసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే ఈ వ్యవహారమంతా అసెంబ్లీ సాక్షిగా బయటపడుతుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. గౌస్ ఆలం వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు.. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థలో జరుగుతున్న ఇటువంటి అక్రమాలను సహించేది లేదని.. బాధ్యులపై చర్యలు తీ

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow