గుర్తు తెలియని వాహనం ఢీ కొని రైతు మృతి


 

గుర్తు తెలియని వాహనం ఢీ కొని రైతు మృతి చెందాడు. బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది

బిజినేపల్లి : గుర్తు తెలియని వాహనం ఢీ కొని రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలం, వట్టెం గ్రామంలో మెయిన్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వట్టెం గ్రామానికి చెందిన పదమ రామచంద్రయ్య (50) తన వ్యవసాయ పొలానికి పోయి గ్రామానికి వస్తుండగా వట్టెం బిజినేపల్లి వెళ్ళు మెయిన్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని ఢీకొనిన వాహనానికి పట్టుకునేందుకు ఉమ్మరంగా గాలిస్తూ మృతి చెందిన శవాన్ని నాగర్ క‌ర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారని తెలిపారు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు సంతానం ఉన్నారు. పెద్దదిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం అనాధగా మారింది. ఉగాది పండగ ముందు మృతి చెందడంతో ఆ గ్రామం శోకసముద్రంలో మునిగిపోయారు. ఈ కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow