ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మృతి చెందాడని ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.
Iran-US-Israel Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్..
అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం దశాబ్దాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాడిని ఇరాన్‌పై ప్రారంభించాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మృతిచెందారని.. ఇరానియన్లు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ట్రంప్ పోస్ట్..
శనివారం జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘చరిత్రలోనే అత్యంత భయంకరమైన వ్యక్తి ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ కారణంగా.. అతడి గ్యాంగ్ కారణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైన ఇరాన్, అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రజలకు న్యాయం జరిగింది. దేశాన్ని తిరిగి సొంతం చేసుకోవటానికి ఇరాన్ ప్రజలకు దక్కిన అద్భుతమైన అవకాశం ఇదే. ఇరాన్‌పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి’ అని రాసుకొచ్చారు.
ఖమేనీ బతికే ఉన్నారు: ఇరాన్
శనివారం టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసంపై జరిగిన దాడుల్లో ఖమేనీ చనిపోయాడని అమెరికా, ఇజ్రాయెల్ దేశాధినేతలు విడివిడిగా ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలపై ఇరాన్ స్పందించింది. తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడన్న వార్తల్ని ఖండించింది. ఖమేనీ సురక్షితంగా ఉన్నాడని ప్రకటించింది. గల్ఫ్‌లోని 14 అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేశామని తెలిపింది. వందలాది మంది అమెరికా సైనికులను హతమార్చామని వెల్లడించింది. ఊహించని రీతిలో ముగింపు ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఇరాన్‌కు చెందిన పలు మీడియా సంస్థలు మాత్రం ఖమేనీ చనిపోయాడని నిర్ధారిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి