ఉగాది 2026: తెలుగు వారి కొత్త సంవత్సరం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి.. లేకపోతే జరిగే నష్టం ఇదే..!


 ఉగాది పండుగ.. తెలుగు సంవత్సరం.. మరో కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది.  తెలుగువారి తొలి పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఆ రోజుకు చాలా విశిష్టత ఉంది..   ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని నియమాలను పాటించాలి.  అసలు ఉగాది పండుగ రోజు  ఏఏ పనులు చేయాలి..ఎలాంటి పనులు చేయకూడదు.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

తెలుగు పంచాంగం ప్రకారం.. విశ్వావశు నామ సంవత్సరం ఈ ఏడాది ( 2‌‌026) మార్చి 19న ఉదయం  6.52 గంటలకు ముగుస్తుంది.  అప్పటి నుంచి కొత్త సంవత్సరం పరాభవనామసంవత్సరం ప్రారంభమవుతుంది.   ఆ రోజున కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదు. అలా చేస్తే ఏడాది మొత్తం అశుభంగానే ఉంటుంది. 



ఉగాది రోజున  ఏం చేయాలి.

ఉగాది పండుగ రోజు తెల్లవారు జామునే అంటే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేని కాలకృత్యాలు తీర్చుకుని గడపలకు పసుపు... కుంకుమ రాసి అలంకారం చేయాలి. గడప అంటే లక్ష్మీదేవితో సమానం.. ఆ తరువాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి .. కులదైవంతో పాటు ... విష్ణుమూర్తిని.... లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే శివుడికి రుద్రాభిషేకం.. బిల్వార్చన చేయాలి. ఆరోజున బ్రహ్మ దేవుడు సృష్టిని ప్రారంభించాడని... విష్ణుమూర్తి.. చేపరూపంలో అవతరించి సోముడు అనే రాక్షసుడిని చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు. 


ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల  స‌మ‌స్యల‌ను ఎదుర్కొనే శ‌క్తి నాకివ్వు, నాకు అష్ట ఐశ్వర్య భోగ‌భాగ్యాల‌ను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంక‌ల్పాన్ని దృఢంగా తీసుకోవాలి.  ఆ తరువాత దగ్గరిలోని దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి. బ్రాహ్మణులకు కొత్త బట్టలు.. పంచాగం  దానం చేసి.. దక్షిణ ఇవ్వాలి. 

ఇంకా ఏమేమి చేయాలంటే..

  • ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి
  • ఆరోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు.
  • ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకోరేట్ చేసి, భక్తితో దేవుడిని పూజించుకోవాలి
  • చింతపండు, బెల్లం, పచ్చిమిర్చి, మామిడి, వేపుపూతతో, ఉప్పు చేసిన ఉగాది పచ్చడిని తినాలి
  • ఎండాకాలం నడుస్తోంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్లతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి.
  • అదేవిధంగా దేవాలయంకు వెళ్లి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి.

ఏమేమి చేయకూడదు.

  • సూర్యోదయం అయిన తరువాత అసలు నిద్రపోకూడదు
  • మాంసాహారాన్ని తినరాదు
  • మద్యం సేవించకూడదు.. పొగ తాగకూడదు.
  • దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం  వినకూడదు..  చదువకూడదు
  • ఉగాది పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు.
  • చిరిగిన.. మాసిపోయిన దుస్తులు ధరించకూడదు.
  • ఎవరిని అవమానించకూడదు.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow