అత్తే అమ్మగా మారిన వేళ.. ఆడదానికి ఆడది శత్రువు కాదు ఇది ఒక ఉదాహరణ.

 

కొడుకు చనిపోయిన తర్వాత కోడలిని ఆ విధంగా మార్చేసిన అత్త..ఇది యదార్ధం

కొడుకు దురదృష్టవశాత్తు చనిపోతే కోడల్ని ప్రయోజకురాలిగా మార్చింది ఓ అత్త. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన మహిళా సాధికారతను చాటిచెప్పడమే కాకుండా..పలువురికి ఆదర్శంగా నిలిచింది.

అత్తారింటికి వచ్చిన కోడలిని కట్నకానుకల పేరుతో వేధించే అత్తలు ఉన్న ఈరోజుల్లో కోడల్ని కూతురుగా భావించి కన్యాదానం చేసిన ఘటన రాజస్థాన్‌(Rajasthan)లో వెలుగుచూసింది. సికర్ (Sikar) జిల్లా ఫతేపూర్‌ షెకావత్‌ ప్రాంతానికి చెందిన కమలాదేవి (Samaladevi)అనే మహిళ ఏడేళ్ల క్రితం తన చిన్న కొడుకు శుభమ్‌ (Shubham)పెళ్లి సునీత దేవి (Sunithadevi)అనే అమ్మాయితో 2016 మే 25న జరిపించింది. కట్నకానుకలు తీసుకోకుండా ఇంటికి కోడలిని తెచ్చుకున్న కమలాదేవి ఆమెను అంతే ప్రేమగా చూసుకుంది. అదే ఏడాది కొడుకు ఎంబీఏ (Mba)చదవడానికి వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ బ్రెయిన్‌ స్ట్రోక్‌(Brain stroke)తో చనిపోయాడు. కొడుకు చనిపోయిన తర్వాత విధవరాలిగా ఉన్నటువంటి సునీతను తన ఇంట్లోనే ఉంచుకొని కన్నకూతురిలా చూసుకుంది కమలాదేవి. పెళ్లికి ముందు డిగ్రీ చదివిన కోడలు సునీత దేవిను ఉన్నత చదువులు అభ్యసించేందుకు ప్రోత్సహించింది. పోస్ట్‌గ్రాడ్యూయేషన్‌ వరకూ చదివించింది. కొడుకుని పోగొట్టుకున్న కమలాదేవి కోడలి సంతోషం కోసం, ఆమె కాళ్లపై ఆమె బ్రతికే ప్రయోజకురాలిగా తీర్చిదిద్దింది. సునీత అన్నీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసింది. గతేడాది హిస్టరీ లెక్చరర్‌(History lecturer)గా ఉద్యోగం సాధించింది. ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడిని మార్చి మహిళా సాధికరత కోసం సునీత అత్త కమలాదేవి ఆమెను చూసుకున్నన విధానం స్థానికంగా చర్చనీయాంశమైంది.

అత్తే అమ్మగా మారింది..

ఉద్యోగం సంపాధించుకున్న కోడలు ఒంటరిగా ఉండకూడదన్న మంచి ఆలోచనతో దూరపు బంధువు అయినటువంటి ముఖేష్‌కి ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకుంది. కోడలి ఇష్టాన్ని కొనుక్కొని తానే తల్లిస్థానంలో ఉండి కోడల్ని కూతురుగా దత్తత తీసుకుంది. బంధువులు, మిత్రులను పెళ్లికి ఆహ్వానించి గ్రాండ్‌గా వివాహం జరిపించింది.

కోడలికి తానే రెండో పెళ్లి..

సునీతదేవిని పెళ్లి చేసుకున్న ముఖేష్‌ ప్రస్తుతం భోపాల్‌లో ఆడిటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి గతంలోనే వివాహం జరిగింది. మొదటి భార్య రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోయింది. రెండో వివాహంగా సునీతను పెళ్లి చేసుుకున్నాడు. ఇద్దరికి రెండో వివాహం కావడంతో రెండు కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా అందరి ఇష్టంతోనే పెళ్లి గ్రాండ్‌గా జరిపించారు అత్తమామలు. అనంతరం తన కోడలిని వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిన అత్త కాపురానికి పంపుతూ కన్నీరు పెట్టుకోవడం స్థానికుల్ని ఎంతగానో కలచివేసింది. అత్తగా ఉన్న ఓ మహిళ కోడలి బాగోగులు, బాధ్యతను ఎంతో ప్రేమగా నెరవేర్చడం అందరి మనసులు గెలుచుకునేలా చేసింది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow