మీ చేతనైంది చేసుకోండి
లేదంటే బదిలీ చేయించండి
*స్థానికులతో ఎంఈఓ సరస్వతి*
మిడ్జిల్ :
మీ చేతనైంది చేసుకోండి, లే దంటే నన్ను ఇక్కడి నుండి పంపించేయండి అంటూ మి డ్జిల్ మండల ఇన్చార్జి ఎంఈఓ గా పనిచేస్తున్న జెడ్పిహెచ్ఎస్ హెడ్మాస్టర్ సరస్వతి స్థానిక నా యకుల తో అన్నారు. బుధ వారం మిడ్జిల్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు గంపగుత్తగా విధులకు డు మ్మాలు కొట్టి ఓ ప్రైవేట్ ఫంక్ష న్ కు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలు దాటిన విధుల్లోకి హాజరు కాకపోవడం పట్ల ఆగ్రహించిన స్థానికులు పాఠ శాల గేటుకు తాళం వేసి నిర సన తెలిపిన విషయం స్థాని కంగా సంచలనం కలిగించింది. ఇదే విషయమై సమాచారం అందుకున్న తహసిల్దార్ స్వప్న విచారణ చేస్తున్న సమయంలో కొందరు స్థాని కులు ఎంఈఓ వాగ్వివాదం చేశారు. ఇందులో భాగంగానే స్థానికులకు ఎంఈఓ సరస్వతి వార్నింగ్ ఇచ్చారు. మీకు చేత నైయింది చేసుకోండి.కాదంటే వారంలో నన్ను ఇక్కడి నుండి పంపించేయండి.అంటూ నిర సన కారులపై విరుచుకుపడ్డా రు. ఇదే విషయం స్థానికంగా సంచలనం కలిగించింది.సం ఘటన పట్ల జిల్లా అధికా రులు స్పందించి విచారణకు ఆదేశించి భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
