బీటెక్ స్టూడెంట్ ఫీజు కట్టలేకపోయాడు.. భర్తతో ఉండటానికి ఇష్టపడని ఓ భార్య.. పెళ్లి ఇష్టం లేదని మరోయువతి.. వీరంతా ఏం చేశారో తెలుసా..!
- ఫీజు కట్టలేక బీటెక్ స్టూడెంట్ సూసైడ్
- సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలో ఘటన
- వేర్వేరు కారణాలతో వరంగల్ జిల్లాలో మహిళ, గద్వాల జిల్లాలో యువతి ..
బోయినిపల్లి, వెలుగు : కాలేజీ ఫీజు కట్టలేకపోవడంతో పాటు తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై బీటెక్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి పరిధిలోని దుబ్బపల్లిలో బుధవారం జరిగింది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం... దుబ్బపల్లి గ్రామానికి చెందిన రామంచ సంజయ్ (18) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ ఫీజు కట్టకపోవడంతో మూడు నెలల నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో పాటు అతడి తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన సంజయ్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే చనిపోయాడు. మృతుడి తండ్రి రామంచ అశోక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.