జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గద్వాల్, ఫిబ్రవరి 19: జోగులాంబ గద్వాల జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. రహదారిపై బస్సు బోల్తా పడడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు వెంటనే రహదారిపై నుంచి ఆర్టీసీ బస్సుకు పక్కకు తొలగించారు. దీంతో రహదారిపై నిలిచిపోయిన వాహనాలు ముందుకు సాగాయి.
గద్వాల్, ఫిబ్రవరి 19: జోగులాంబ గద్వాల జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. బాధితులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Tags
mahabubangar