నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, మహాదేవునిపేట గ్రామంలో నుంచి గంగారం వెళ్ళు రోడ్డు కు చెట్లపై 11 కేవీ విద్యుత్ వైర్లు కమ్ముకొని ఉండటంతో చెట్లు ఎవరైనా పట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ గురయ్యే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, మహాదేవునిపేట గ్రామంలో నుంచి గంగారం వెళ్ళు రోడ్డు కు చెట్లపై 11 కేవీ విద్యుత్ వైర్లు కమ్ముకొని పోవడంతో చెట్లు ఎవరైనా పట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ గురయ్యే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఎవరైనా చెట్లను తాకి ప్రాణాలు పోతేగాని విద్యుత్ అధికారులు స్పందించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ రోడ్డుకు పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కంచె లేకపోవడంతో మూగజీవాలతో పాటు, గమనించని ప్రజలు ఎవరైనా తాకితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ అధికారులు ఎక్కడ ఏ ప్రమాదాలు జరగకుండా 11 కేవీ విద్యుత్ వైర్లు ప్రమాదాలకు గురవుతున్నాయో గమనించాల్సిన విద్యుత్ అధికారులు ఆఫీసులకే పరిమితం కావడంతో ప్రమాదాలు ఎన్నో జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చెట్లకు చోచ్చుకుపోయిన 11 కేవీ విద్యుత్ వైర్లను తొలగించి ముందే రాబోయే రోజుల్లో గాలి వానలు వచ్చి విద్యుత్ వైర్లు తెగి ఊహించని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ వైర్లు అల్లుకుపోయిన కొమ్మలను తొలగించి, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కు కంచె నిర్మాణం చేయాలని ప్రజలు చేతులెత్తి కోరుతున్నారు.
Tags
mahabubnagar