హాస్టల్లో చికెన్ కోసం గొడవపడి విద్యార్థులు తలలు పగిలేలా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగింది. ఈ పరిణామంతో.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది.
ఎంబీఏ, ఎకనమిక్స్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థులు తలలు పగిలేలా కొట్టుకున్నారు. పలువురిపై కేసు నమోదైంది. కేయూలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. హాస్టల్లో చికెన్ కోసం విద్యార్థులు గొడవపడ్డారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
చికెన్ పంపకాల్లో లొల్లి మొదలైంది. నిన్న (ఫిబ్రవరి 22) ఆదివారం కావడంతో లంచ్ టైంలో హాస్టల్లో చికెన్ పెట్టారు. విద్యార్థులంతా చికెన్ తిన్నారు. అయితే.. అప్పటికీ చికెన్ కొంత మిగిలింది. ఆ మిగిలిపోయిన చికెన్ మాకు కావాలంటే మాకు కావాలని ఎంబీఏ, ఎకనమిక్స్ స్టూడెంట్స్ గొడవ పడ్డారు. ఈ గొడవ పెద్దదైంది. ఒకరిద్దరితో మొదలైన గొడవ హాస్టల్లో ఉన్న విద్యార్థులంతా ఇన్వాల్స్ అయ్యే వరకూ వెళ్లింది. ఈ గొడవ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tags
Hyderabad