సిద్దిపేటలో ఉరేసుకున్న వైద్య విద్యార్థిని ..అసలేం జరిగింది.?


 సిద్దిపేట జిల్లా  అర్బన్ మండలం మిట్టపల్లిలో వైద్య విద్యార్థిని హత్మహత్య చేసుకుంది. పెద్దపెల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం మెడిపెల్లి గ్రామానికి చెందిన  శ్రీజ   సిద్దిపేటలోని  ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఫిజియోథెరఫీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఫిబ్రవరి 22న హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో   శ్రీజ తన చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ కు వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి... విద్యార్థిని డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు. తోటి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్నారు. విద్యార్థిని మృతికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా లేక ఇతర కారాణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow