కొమురం భీమ్ జిల్లా జైనూర్ లో భారీ వర్షం


  తెలంగాణలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ,తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తుండగా.. కొమురం భీమ్  జిల్లా జైనూర్  లో భారీ వర్షం పడింది. ఫిబ్రవరి 22న సాయంత్రం  ఒక్కసారిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి.  వాహనదారులు  రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడ్డారు.

మూడు రోజులు రెయిన్ అలర్ట్

మరోవైపు తెలంగాణకు మరో మూడు రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది రాష్ట్ర వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది.  ఉత్తర తెలంగాణ, భద్రాద్రి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.  మూడు రోజుల తర్వాత మళ్లీ టెంపరేచర్లు పెరుతాయంది. ప్రస్తుతం మధ్యాహ్నం 32 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow