ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

మూలమలుపు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పంట పొలంలో బోల్తా పడింది.

 కోడేరు: నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు మండలం పసుపుల శివారులో మూలమలుపు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శనివారం రాత్రి 12:30 గంటలకు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీ రాఘవేంద్ర ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు(టీఎస్ 06 ue 4466 నెంబర్) రాత్రి 12:30 గంటలకు కోడేరులోని ఓ వివాహ శుభకార్యానికి వెళ్తోంది. పసుపుల నుంచి కోడేరు మధ్యలో బోటుకొని తిప్ప గుట్ట సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సులో డ్రైవర్ తప్ప ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow