తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్‌కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఆర్టీసీ డిపో వద్ద...
జోగు రామన్న ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోయా కొనుగోలుపై బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. గత కొంత కాలంగా సోయా రైతులు పడుతున్న ఇబ్బందులపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా సోయా కొనుగోలులో ధరల సరైన ఆధారిత విధానాలు లేకపోవడంపై పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో బంద్‌కి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బస్సుల రాకపోకలను నేతలు అడ్డుకున్నారు. ఆర్టీసీ డిపో వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న జోగు రామన్నతో సహా పలువురు నేతలను అరెస్టు చేశారు.
రైతులకు న్యాయం చేయాలి..
జోగురామన్న తమ పోరాటాన్ని విసృతం చేయడంలో భాగంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. రైతులకు సరైన ధరలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుత విధానాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రైతుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలపై తాము పోరాడుతుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమపై కక్ష పూరితంగావ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులకు సరైన గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేసేవరకు తాము పోరాడుతామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
భారీగా బలగాలు..
ఈ ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో పోలీసులు భారీ బలగాలతో ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్నారు. ప్రజల మౌలిక హక్కులపై అడ్డగోలుగా ఇబ్బందులు కలిగించకుండా జాగ్రత్త తీసుకోవాలని వారిని హెచ్చరించారు. అయితే, బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా జోగు రామన్న సహా మరికొంతమంది నేతలు అరెస్టయ్యారు. ఈ ఘటనతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఆందోళనల నేపథ్యంలో జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, గులాబీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిచడం సరికాదని మండిపడ్డారు. తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నరని ఫైర్ అయ్యారు.