నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజ విక్రయించిన వినియోగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ హెచ్చరించారు.
జడ్చర్ల: నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజ విక్రయించిన వినియోగించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ హెచ్చరించారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధం విధించిందని జడ్చర్లలో ప్రమాదకరమైన మాంజా ఎవరైనా అమ్మినా, దీంతో ఎవరికైనా ప్రమాదం జరిగినా.. విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ దృష్టిలో ఉంచుకుని చైనా మాంజ విక్రయించకుండా మార్కెట్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎక్కడైనా మార్కెట్లో విక్రయి స్తే డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇ వ్వాలని సీఐ పట్టణ ప్రజలకు సూచించారు. విస్తృత తనిఖీలు ఎస్సైలు మల్లేష్, జయప్రసాద్, ఖాదర్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Tags
Jadcherla