శిలా ఫ‌ల‌కంలో సీఎం పేరు మాయం..?

 

వనపర్తి జిల్లా ఆత్మకూర్,అమరచింత మున్సిపాలిటీల్లోని చర్లపరమేశ్వర స్వామి చెరువు,పెద్దచెరువు సుందరీకరణ పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు.


 అమరచింత : వనపర్తి జిల్లా ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల్లోని చర్లపరమేశ్వర స్వామి చెరువు,పెద్దచెరువు సుందరీకరణ పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అమృత్ 2.O కేంద్ర ప్రభుత్వ పథకం కింద ఒక్కో చెరువు సుందరీకరణకు రూ.3.14 కోట్ల చొప్పున రెండు చెరువులకు కలిపి రూ.6.28 కోట్లు మంజూరైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూర్ లో ఏర్పాటు చేసిన శిలా పలకంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు లేకుండానే మంత్రి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడంపై పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow