టికెట్ కావాలా అప్లికేషన్ పెట్టుకోండి.. మున్సిపల్ ఎన్నికల్లో మారిన ట్రెండ్


 

  •  ఆశావహుల నుంచి అప్లికేషన్లు 
  • తీసుకుంటున్న పార్టీలు  వాటి సాయంతో ఎంక్వైరీలు, సర్వేలు
  • గెలిచే అవకాశమున్న వారికే టికెట్లు ఇచ్చే ప్లాన్​
  • మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ప్రధాన పార్టీలు కొత్త ట్రెండ్‌‌‌‌‌‌‌‌కు తెరతీశాయి. పిలిచి టికెట్లు ఇచ్చే పద్ధతికి తెరదించుతూ ఆశావహుల నుంచే నేరుగా అప్లికేషన్లు తీసుకుంటున్నాయి. వాటి ద్వారా ఎంక్వైరీలు, సర్వేల ద్వారా ప్రజల్లో పలుకుబడి, విజయావకాశాలను అంచనా వేసి టికెట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఒక పద్ధతి ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగడం వల్ల పార్టీ విజయావకాశాలు మెరుగుపడడంతో పాటు రెబల్స్ బెడద ఉండదని భావిస్తున్నాయి. మరోవైపు, మున్సిపల్ ఎన్నికల్లో ఆశావాహుల నుంచి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అప్లికేషన్లు తీసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల్లో ఒక్కో డివిజన్ నుంచి సగటున 4 నుంచి 8 మంది దాకా పోటీ పడ్తున్నారు. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో మూడు ప్రధాన పార్టీల నుంచి ఏకంగా 1,069 అప్లికేషన్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి 373, బీజేపీ నుంచి 250 రాగా, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నుంచి 446 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో 4వ డివిజన్ నుంచి పోటీ చేయడానికి ఏకంగా 20 మంది పోటీ పడ్తున్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులకు కాంగ్రెస్ పార్టీ నుంచి 526 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఒక్క 12వ వార్డ్ కోసం 29 మంది దరఖాస్తు చేసుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 2వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి 13 మంది చొప్పున పోటీ పడుతున్నారు. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 8వ వార్డు స్థానానికి కాంగ్రెస్ తరఫున 12 మంది, బీఆర్ఎస్ తరఫున 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. 
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow