నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి గణేష్ యూత్ సేన



జడ్చర్ల : భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తనదైన ముద్ర వేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆయన ఆశయాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కావేరమ్మపేట గణేష్ యూత్ సేన సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం నేతాజీ జయంతిని పురస్కరించుకుని గ్రామంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కావేరమ్మపేట గ్రామ చావిడి ఎదురుగా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి గణేష్ యూత్ సేన ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతాజీ చేసిన త్యాగాలను, దేశం కోసం ఆయన సాగించిన పోరాటాన్ని స్మరించుకున్నారు. పలువురు మాట్లాడుతూ బానిస సంకెళ్లను తెంచుకోవడానికి ఆజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఏకం చేసిన ధీశాలి నేతాజీ. ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ నేటి తరం యువతకు మార్గదర్శకమని, ప్రతి యువకుడు దేశభక్తిని పెంపొందించుకుని, సమాజ సేవలో ముందుండటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బుక్క మహేష్, మాజీ వార్డు సభ్యులు గుండు చంద్రమౌళి, నాయకులు చటమోని రమేష్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బుక్క నవీన్, బుక్క లక్ష్మయ్య, మిద్దె మల్లేష్, గణేష్ యూత్ సేన సభ్యులు గుండు చంద్రశేఖర్, గోనెల నరేందర్, బుక్క శివకుమార్, మిద్దె నాగరాజు, బుక్క కుమార్, వేణు, మల్లేష్, ఎజాస్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow