పరిషవేదిశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సుమారు 7 లక్షల సొంత నిధులతో 1400 మీటర్ల సిసి రోడ్డును బిజెపి రాష్ట్ర నేత ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి వేయించారు.
జడ్చర్ల: జడ్చర్ల మండల పరిధిలోని మీనాంబరంలో గల పరిషవేదిశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సుమారు 7 లక్షల సొంత నిధులతో 1400 మీటర్ల సిసి రోడ్డును బిజెపి రాష్ట్ర నేత ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి వేయించారు. ఈ సందర్భంగా గురువారం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బైరంపల్లి సర్పంచ్ బొడ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ. గత సంవత్సరం శివపార్వతుల కల్యాణ స్వాముల పాల్గొన్న ముచ్చర్ల జనార్దన్ రెడ్డి దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు ఆలయ ప్రాంగణంలో సిసి రోడ్డు వేయించాలని కోరడంతో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు ఆలయ ప్రాంగణంలో సిసి రోడ్డు నిర్మాణం చేపట్టారని సొంత నిధులతో సిసి రోడ్డు వేయించడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముచ్చర్ల జనార్దన్ రెడ్డి పరుషలేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డిని ఆలయ సాంప్రదాయ ప్రకారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు బైరంపల్లి సర్పంచ్ బోడ గోపాల్ సభ్యులు కొత్తపల్లి యాదయ్య పుట్ట పర్వతాలు పాచాలపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు గౌడ్ బైరంపల్లి మాజీ సర్పంచ్లు కడయ్య భక్తులు దేవల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags
Jadcherla