మానవత్వం చాటుకున్న ఎస్సై..


 ఇటిక్యాల/ఎర్రవల్లి: పోలీసుల అంటేనే తరుసుగా కఠినంగా వ్యవహరిస్తారని మనం వింటుంటాం.. కానీ దీనికి భిన్నంగా పోలీసులు అంటే మంచితనం మానవత్వం ఉంటుందని, ఇటిక్యాల ఎస్ఐ కే రవి నిరూపించారు. మండల కేంద్రం నుండి పొగాకు కంపెనీకి వెళ్ళు రోడ్‌లో ఇటిక్యాల గ్రామ సమీపాన ఉన్న వాగుపై కాంక్రీట్ పోయి గుంతలు ఏర్పడి ఉండగా వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతుండగా.. గమనించిన ఎస్సై కే రవి లోడ్ కంకరతో కూడిన డస్ట్‌ను తెప్పించి జేసీబీ సహాయంతో గుంతలను పూడ్చడం జరిగింది. ఎస్సై కే రవిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆర్.సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow