హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. బందోబస్తు, శాంతిభద్రతల అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పోలింగ్ పూర్తికాగానే కౌంటింగ్ జరుగుతుందన్నారు. తొలి విడతలో 395, రెండో విడతలో 495 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.8.2 కోట్లు సీజ్ చేశామని వివరించారు. 50వేల మంది సివిల్ పోలీసులు విధుల్లో ఉంటారని, 60 ప్లటూన్స్ బృందాలు బయటి నుంచి వచ్చాయని ఎస్‌ఈసీ తెలిపారు.
Tags
Hyderabad