నేడే తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్.. భారీగా నగదు, మద్యం సీజ్


 తెలంగాణ తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భారీగా పోలీసులు మోహరించారు. ఎన్నికల విధుల్లో లకక్షల మందికి పైగా పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. 3 వేలకు పైగా పంచాయతీల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ను పర్యవేక్షించనున్నారు.

తొలివిడతలో భాగంగా 189 మండలాల పరిధిలోని 3800 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. 56 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, 65,455 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు తొలివిడత పోటీలో ఉన్నారు. ఈ ఎన్నకలకు 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా.. ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న రూ.8.20 కోట్ల నగదు, మద్యం, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కోడ్ ఉల్లంఘించిన ఘటనల్లో 229 ఎఫ్ఐఆర్ లు నమోదయినట్లు తెలిపారు. సరిహద్దుల్లో 54 చెక్ పోస్టులు, 537 ఫ్లైయింగ్ స్క్వాడ్లు గస్తీ కాస్తున్నాయి. పోలింగ్ జరుగుతున్న మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. డిసెంబర్ 14న రెండో విడత, 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow