Ameerpet: హైదరాబాద్, అమీర్‌పేటలోని మైత్రీవనం ప్రాంతంలో గల అన్నపూర్ణ బ్లాక్‌లో ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం రెండవ అంతస్తు నుండి దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన కోచింగ్ సెంటర్ సిబ్బంది వెంటనే విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, డిజాస్టర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చురుకుగా సాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ లేదా బ్యాటరీలు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం.
Tags
Telangana