హైదరాబాద్: రాష్ట్రంలో ఈసారి సంక్రాంతి పండగకు వారం రోజులపాటు సెలవులు రానున్నాయి. పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో జనవరి 11 నుంచి 15వ తేదీ వరకు.. ఐదు రోజులు సెలవులు ఉంటాయని ప్రకటించింది. తాజాగా ప్రభుత్వం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమగా పేర్కొంది. జనవరి 10న రెండో శనివారం కూడా కలిసి రావడంతో ముందు ప్రకటించిన సెలవుల్ని పునఃసమీక్షించారు. జనవరి 10 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించారు. జనవరి 17 శనివారం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరిస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
Tags
Telagana