మూడు నెలల పోరాటం తర్వాత… చివరికి న్యాయం గెలిచింది



 💥 *ఫలించిన.... నేనుసైతం పోరాటం*

💥 *ఎస్పీఎఫ్ ఏఎస్ఐ ప్రసాద్... బదిలీ* 

💥 *మూడు నెలల పోరాట.... ఫలితం*

💥 *న్యాయం గెలిచిందన్న... నేనుసైతం*

💥 *పాలమూరు నుండి... భద్రాద్రి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు పనిష్మెంట్ పై బదిలీ*

💥 *ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీకి.... రుణపడి ఉంటాం* 

💥 *సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్*

        గత కొంతకాలంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో

ఒకవైపు వరస దొంగతనాలు, మరోవైపు కిడ్నాప్లు, పోస్టుమార్టం లేకుండా మృతదేహాలు తరలింపు వ్యవహారంలో ఎస్పీఎఫ్ ఏఎస్ఐ ప్రసాద్ వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే గత మూడు నెలలుగా నేనుసైతం చేసిన న్యాయ పోరాటం ఎట్టకేలకు విజయం సాధించింది. ఏఎస్ఐ ప్రసాద్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, వివాదాలకు తెరలేపడంపై ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీ స్వాతిలక్ర తోపాటు పలువురు ఉన్నతాధికారులకు *సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్* పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోని గత మూడు నెలల్లో దాదాపు నాలుగు సార్లు హైదరాబాద్ కు చెందిన ఎస్పీఎఫ్ ఉన్నదాధికారులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని సూపర్డెంట్ చాంబర్ లో ఆర్ఎంవో, ఐసీయూ సిబ్బందితో ఎస్పీఎఫ్ ఏఎస్ఐ ప్రసాద్ వ్యవహరణ శైలిపై విచారణ చేపట్టారు. 

👉 *న్యాయం గెలిచింది. ప్రవీణ్*

            విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని గత మూడు నెలలుగా తాము చేస్తున్న పోరాట ఫలితంగా ఎస్పీఎఫ్ ఏఎస్ఐ ప్రసాద్ ను పాలమూరు నుండి భద్రాద్రి కొత్తగూడెంకు పనిష్మెంట్ పై బదిలీ చేయడంపై సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ఎట్టకేలకు న్యాయం గెలిచిందని ఆయన తెలిపారు. ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీ స్వాతిలక్ర విచారణ చేపట్టి, ఏఎస్ఐ ప్రసాద్ పై చర్యలు తీసుకోవడం జరిగిందని, ఎస్పీఎఫ్ అడిషనల్ డీజీకి రుణపడి ఉంటామని ప్రవీణ్ పేర్కొన్నారు. 

👉 *పాలమూరు నుండి... భద్రాద్రి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు బదిలీ*

       ఎస్పీఎఫ్ ఏఎస్ఐ ప్రసాద్ ను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి నుండి భద్రాద్రి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కు పనిష్మెంట్ పై బదిలీ చేశారు. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం ఎస్పీఎఫ్ ఏఎస్ఐని తోటి ఎస్పీఎఫ్ సిబ్బంది సత్కరించి వీడ్కోలు పలికారు. 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow