Funny Police Poster: మందుబాబులకు పోలీసుల ‘డీజే లాకప్’ ఆఫర్.. దొరికితే స్టేషన్‌లో పార్టీ!

 



Funny Police Poster: న్యూ ఇయర్ వేడుకల వేళ హైదరాబాద్ పోలీసులు మందుబాబులకు తమదైన శైలిలో “కిక్” ఇచ్చే వార్నింగ్ ఇచ్చారు. తాగిన మత్తులో వాహనాలు నడిపే వారి కోసం “డీజే లాకప్” (#DJLockUp) పేరుతో ఒక సెటైరికల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఈ న్యూ ఇయర్ ఈవ్‌లో మాకు అతిథులుగా మారకండి” (Try not to be our guests) అంటూ పోలీసులు చమత్కరించారు. ఈ “డీజే లాకప్” పార్టీకి కేవలం రాష్ డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపే వారికి మాత్రమే “ఫ్రీ ఎంట్రీ” ఉంటుందని పేర్కొన్నారు. ఇక మెనూ విషయానికొస్తే.. స్టేషన్‌లో “కాప్ కేక్” (Cop Cake) మరియు డెజర్ట్ కింద “కస్టడీ” (Custard-y) వడ్డిస్తామని సెటైర్ వేశారు. సమీపంలోని పోలీస్ స్టేషనే ఈ పార్టీ వెన్యూ అని స్పష్టం చేశారు. ఈ హాస్యభరితమైన పోస్టర్ వెనుక సీరియస్ హెచ్చరిక కూడా ఉంది. ఐపీఎస్ అధికారి వి.సి. సజ్జనార్ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై “జీరో టోలరెన్స్” (Zero Tolerance) విధానాన్ని ప్రకటించారు. డిసెంబర్ 31 రాత్రి నగరవ్యాప్తంగా 120 కీలక ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (BAC) 35 పాయింట్లు దాటితే.. అది కేవలం పరీక్షలో ఫెయిల్ అవ్వడం కాదని, జీవితం అనే పరీక్షలో ఫెయిల్ అవ్వడమేనని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా పార్టీల అనంతరం క్యాబ్ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ క్రియేటివ్ క్యాంపెయిన్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow