Chicken – Dinosaur: మీకు తెలుసా? కోడి కూడా డైనోసారే.. ఇవిగో దాని ఫ్యామిలీ డిటైల్స్!


 డైనోసార్ ఎగ్స్ గురించి మనం ఎన్నో జోకులు వేస్తుంటాం. కానీ, ఏ రోజైనా ఆలోచించారా? డైనోసార్ వంటి భారీ మృగం గుడ్లు పెట్టడం ఏమిటీ ఫన్నీగా అని. గట్టిగా ఆలోచించండి.. నెమ్మదిగా మీకే అర్థమవుతుంది. కోడి గుడ్డు పెడుతుంది.. డైనోసార్ కూడా గుడ్డు పెడుతుంది. అంత మాత్రాన్న అవి రెండూ ఒకటే ఎలా అయిపోతాయని అనుకుంటున్నారా? అయితే, పరిశోధనల్లో తేలిన ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి. రేపటి నుంచి మీకు తప్పకుండా ప్రతి కోడిలో ఒక డైనోసార్ కనిపిస్తుంది.

కోళ్లు, డైనోసార్లది ఓకే ఫ్యామిలీనా?

డైనోసర్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎగిరే డైనోసర్లు, ఎగరని డైనోసార్లు. కానీ, అవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి. కోడి, పావురాలు.. పక్షి లాంటి డైనోసర్ జాతికి చెందినవి. ఇవన్నీ కూడా 60 మిలియన్స్ ఏళ్ల కిందట.. నాటి యుగాంతం నుంచి బతికి బయటపడి మన ముందు తిరుగుతున్నాయి. ఇంతకీ డైనోసార్లు, కోళ్లుగా ఎలా పరిణామం చెందాయి? భారీ ఉల్క భూమిని ఢీకొట్టిన సమయంలో ఏం జరిగింది?

66 మిలియన్ సంవత్సరాల క్రితం ఏమి జరిగింది?

66 మిలియన్ సంవత్సరాల క్రితం ఓ ​​భారీ ఉల్క భూమిని ఢీకొట్టింది. దాని ప్రభావంతో భూమ్మీద ఉన్న దాదాపు అన్ని డైనోసార్లు అంతం అయ్యాయి. కానీ, అక్కడక్కడ చిన్న డైనోసార్ సమూహాలు మిగిలిపోయాయి. చిన్న పరిమాణంలో ఉన్న డైనోసార్లకు ఈకలు మొలిచాయి. వాటి కారణంగా వేగంగా పరిగెత్తడం, చెట్ల రంధ్రాలలో దాక్కోవడం చేసేవి. కొద్ది కాలం తర్వాత కొంత దూరం ఎగరడం కూడా మొదలుపెట్టాయి.  ఈ సమూహాన్ని థెరోపాడ్ డైనోసార్లు అని పిలుస్తారు. వీటి జీవపరిణామ క్రమాన్ని పరిశీలిస్తే,

 150 మిలియన్ సంవత్సరాల క్రితం వెలోసిరాప్టర్, ఇతర మాంసం తినే డైనోసార్లు ఈకలను కలిగి ఉన్నాయి.

⦿ 125 మిలియన్ సంవత్సరాల క్రితం కొన్ని థెరోపాడ్‌లు చిన్నవిగా మారాయి. రెక్కలు పెరిగాయి.

⦿ 66 మిలియన్ సంవత్సరాల క్రితం అతి చిన్న ఈకలు కలిగిన థెరోపాడ్‌లు మాత్రమే ఉల్కాపాతం నుంచి బయటపడ్డాయి.

⦿ 50–20 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రాణాలతో బయటపడినవి నెమ్మదిగా పక్షులుగా మారాయి.

⦿ 10 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు డైనోసార్ల కోళ్లుగా మారాయి.

కోళ్లు డైనోసార్లు అనేందుకు శాస్త్రీయ రుజువులు

⦿ ఎముకలు: విష్‌ బోన్, బోలు ఎముకలు, మూడుకాలి పాదాలు, కోడి తుంటి ఆకారం, రెక్స్ వెలోసిరాప్టర్ల మాదిరిగానే ఉంటాయి.

⦿ గుడ్లు: డైనోసార్ గుడ్లు, కోడి గుడ్లు ఒకే షెల్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.

⦿ ప్రోటీన్లు: శాస్త్రవేత్తలు T. రెక్స్ ఎముకలలో అసలు డైనోసార్ ప్రోటీన్లను కనుగొన్నారు. రెండింటిలో సేమ్ ప్రొటీన్లు ఉన్నాయి.

⦿ DNA, జన్యువులు: కోళ్లు ఇప్పటికీ మాంసం తినే డైనోసార్ల మాదిరిగానే అనేక జన్యువులను కలిగి ఉంటాయి.

డైనోసార్స్ తో కోళ్ల సంబంధాన్ని నిరూపించే జెనెటిక్స్!

ప్రతి కోడి లోపల దాగి ఉన్న డైనోసార్ భాగాలు ఉన్నాయి.  దంతాలు, పొడవైన ఎముక తోక,రెక్కలపై గోళ్ల వేళ్లకు సంబంధించిన జన్యువులు ఉన్నాయి. కానీ, అవన్ ఇన్ యాక్టివ్ గా ఉంటాయి. శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఈ జన్యువులను తిరిగి యాక్టివేట్ చేసినప్పుడు, కోడి పిండాలు నిజమైన దంతాలను కలిగి ఉంటాయి. పలు ఎముకలు  పొడవైన తోకను పెంచుతాయి. రెక్కలకు ప్రత్యేక గోళ్ల వేళ్లు పెరగడం మొదలవుతాయి. కోడి డైనోసార్ లాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది. మొత్తంగా కోళ్లు థెరోపాడ్ డైనోసార్ల ఉప సమూహం అని ఈజీగా తేలిపోతుంది. సో, కోడితో పాటు పావురం, ఆస్ట్రిచ్, చిలుక, గద్దను కూడా  సజీవ డైనోసార్‌ గా వర్గీకరించారు. కోడి పూర్తి శాస్త్రీయ నామం గాలస్ గాలస్ డొమెస్టికస్. ఇది డైనోసార్ అనే పెద్ద సమూహంలో ఉంటుంది. డైనోసార్లు చనిపోయిన తర్వాత… మిగిలిన ఈకలు కలిగిన మాంసం తినే డైనోసార్లు చెట్ల మీద నివసించేవి. నెమ్మదిగా అవి ఆధునిక పక్షులుగా మారాయి. కోడి జీవించి ఉన్న డైనోసార్ గా శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow