ఫ్రిజ్ కంప్రెస‌ర్ పేలి ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు, ఓ చిన్నారికి తీవ్ర గాయాలు


  ఫ్రిజ్‌ లో ఉన్న కంప్రెస్సర్ సిలిండర్ పేలి ముగ్గురు గాయపడిన సంఘటన శనివారం సాయంత్రం ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈఘటనలో ఇద్దరు మహిళలకు, ఓ చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ధరూర్ మండల కేంద్రంలో మూసి ఉన్న షాపులో నుంచి పొగలు వస్తుండటంతో గమనించిన అశ్విని, సునీత అనే మహిళలు మూసి ఉన్న షాపు‌ షెటర్ ను తెరిచారు. భారీ ఎత్తున పొగలు కమ్మి ఒక్క సరిగా ఫ్రిడ్జ్ లోని కంప్రెస్సర్ సిలిండర్ పేలడం తో ఇద్దరి మహిళలకు, పదకొండు నెలల బాబు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యం అందించగా మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూల్ కు తరలించినట్టు వైద్యులు ఫర్హాజ్ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం కర్నూల్ లోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. విషయం తెలుసుకున్న జ‌డ్పీ మాజీ చైర్మన్ సరిత, నడిగడ్డ హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్ కుమార్, బుచ్చిబాబు, బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వైద్యులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow