Mahabubnagar: రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆయన సొంత ఇల్లు, బంధువుల ఇల్లు తోపాటు నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడబలూరు వసుధ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో శ్రీనివాస్‌కు హైదరాబాదులోని రాయదుర్గంలో మై హోమ్ భుజాలో ఒక ప్లాటు, కర్ణాటక రాష్ట్రంలో 11 ఎకరాలు, అనంతపురంలో 11 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నాలుగు ప్లాట్లు, నారాయణపేట జిల్లాలో మూడు ప్లాట్లు, కృష్ణా మండలం గుడెబలూరులో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ (రైస్ మిల్) ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
వీటితోపాటు 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, ఒక కియా కారు, ఒక ఇన్నోవా కారు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుంది అని మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. డిప్యూటీ సర్వేయర్‌గా మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల గ్రామంలో ఉద్యోగ ప్రస్థాన్నాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ మహబూబ్ నగర్ జిల్లా సర్వే డిపార్ట్మెంట్‌లో డిప్యూటీ ఇన్స్పెక్టర్, ఎఫ్ఎసీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుపరిచితుడైన శ్రీనివాస్ ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో సర్వత్ర చర్చనీయాంశం అయ్యింది.
Tags
mahabubnagar